వైద్యులే దేవుళ్ళు * వైద్యులను సన్మానించిన డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్
కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) జూలై 1 వైద్యులు మానవులకి ప్రాణదాతలని దేవుళ్ళతో సమానమని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా అన్నారు అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం జవహర్ నగర్ ప్రభుత్వ వైద్యశాల డాక్టర్లు నర్సులకు పుష్పగుచ్చాలు అందజేసి శాలువాళ్ళతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా వైద్యులు. నర్సులు. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా వారి ప్రాణాలను ఫణంగా పెట్టి లక్షలాది మందికి అత్యుత్తమ వైద్య సేవలు అందించి ప్రజల ప్రాణాలను కాపాడిన ఘనత వైద్యులకె దక్కిందని స్పష్టం చేశారు కొందరు వైద్యులు తమ ప్రాణాలను సైతం పోగొట్టుకున్నారనీ ఇది ఎంతో బాధాకరమని భాగుద్వేగానికి గురయ్యారు ఈ సందర్భంగా ప్రాణాలను కోల్పోయిన డాక్టర్లకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని అన్నారు జులై ఒకటవ తారీకు అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులను సన్మానించడం నాకు ఎంతో గర్వంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నవీన్ కుమార్ తెరాస పార్టీ నాయకులు మాధవ్ వైద్యులు తదితరులు పాల్గొన్నారు