వైద్య విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
– గుర్తింపు పొందిన కళాశాలల్లో చేర్పించాలి
– వరంగల్ కాళోజి హెల్త్ యూనివర్సిటీ ముందు విద్యార్థులు వారి తల్లిదండ్రుల నిరసన
వరంగల్ ఈస్ట్ ,ఆగస్టు 08(జనం సాక్షి):
రాష్ట్రం లోని ఎం ఎన్ ఆర్ ,మహావీర్ ,టి ఆర్ ఆర్ వైద్య కళాశాలలకు చెందిన ఎంబీబీఎస్, పీజీ విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు సోమవారం వరంగల్ నగరంలోన కాలజీ హెల్త్ యూనివర్సిటీ ముందు నిరసన నిర్వహించారు .కేంద్ర ప్రభుత్వం పై మూడు కళాశాలల రిజిస్ట్రేషన్లను రద్దు చేయడంతో టుమారో 530 మంది విద్యార్థులు గత మూడు నెలలుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులు వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు బాగుండేలా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటనే విద్యార్థుల ను గుర్తింపు పొందిన వైద్య కళాశాలలకు పంపించాలని డిమాండ్ చేశారు .లక్షలు వెచ్చించి విద్యార్థులను కళాశాల చేర్పించామని ఇప్పుడు ఆయా కళాశాలల రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతో తీవ్రమానసిక వేదనకు గురవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఎం ఎం సి హైకోర్టు ఆదేశానుసారం తప్పకుండా గుర్తింపు పొందిన కళాశాలల్లో చేర్పించాలని కోరారు. లేకపోతే విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతుంది అని రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు ప్రాధేయపడ్డారు .ఇప్పటి వరకు ఎంతో మంది వైద్యాధికారులను మెడికల్ బోర్డు అధికారులు కలిసి తమ ఆవేదన వినిపించామని ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.