వైభవంగా గణనాథుల నిమజ్జనం

-తెల్లవారు జాము 3 గంటల వరకు సాగిన నిమజ్జనం

-అధికారుల ఆదేశాలు బేఖాతర్‌

-హిందువులపై ప్రభావం చూపని పోలీస్‌ ఆంక్షలు

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 4 (v):తొమ్మిది రాత్రులపాటు విశేష పూజలందుకున్న గణనాయకున్ని ఆదివారం అత్యంత ఆడంబరంగా భక్తి శ్రద్దలతో నిమజ్జనం చేశారు. కరీంనగర్‌ పట్టణంతోపాటు జిల్లా వ్యాప్తంగా మద్యాహ్నం 1 గంటలకు శోభాయాత్రలు ప్రారంభమయ్యాయి. ముందస్తుగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకొకుండా ఉండడంతోపాటు ఆర్దరాత్రి వరకు అన్ని గణనాథులను నిమజ్జనం పూర్తి చేయాలని పోలీస్‌ అధికారులు హుకుం జారీ చేయడంతో వివిద వర్గాలకె చెందిన ప్రతినిధులు శోభాయాత్రను గతంకంటే ముందే ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని వినాయకుల శోభాయాత్ర నగరం నడిబొడ్డున గల టవర్‌ సర్కిల్‌ విూదుగా వెల్లడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి

కూడా ఈ యాత్ర సుమారు 5 గంటల ప్రాంతంలో టబర్‌ సర్కిల్‌కు తొలివినాయకుడు రాగానే రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ పూజాదికాలు నిర్వహించి గణనాథున్ని నిమజ్జనం చేసేందుకు సాగనంపారు. నగరంలోని వినాయకులను నిమజ్జనం చేసేందుకుగాను ఐదు ప్రాంతాల్లో ఏర్పాట్లు చేసిన అధికారులు ఎటువైపు వినాయకులను అటువైపు వెల్లేలా చూశారు. రహదారులగుండా పోలీస్‌ ఫోర్స్‌తోపాటు ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు, ¬ంగార్డులను నియమించారు. అంతేకాక రహదారులపై అక్కడక్కడ వైద్య శిభిరాలను కూడా ఏర్పాటు చేశారు. తాగునీటి సౌకర్యాన్ని మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఏర్పాటు చేసింది. నిమజ్జనానికి బారీ క్రేన్లను ఏర్పాటు చేసి గణనాథులను ప్రశాంతంగా నిమజ్జనం చేసేలా అధికారులు విశ్వహిందు పరిషత్‌ ప్రతినిధులు ప్రదానంగా బీజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌ టవర్‌ సర్కిల్‌లో ఉండి వివిద వీఐపీలచేత ప్రతి వినాయకుడికి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించిన తర్వాతే నిమజ్జనానికి పంపారు. అయితే ఈసారి గతంలోకంటే ఎక్కువ వినాయకులను ప్రతిష్టించినట్లు లెక్కలు చెప్తున్నాయి. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్‌లు అధికారులు చర్యలు తీసుకున్నారు.అయితే రాత్రి 12 గంటలలోపే నిమజ్జనం పూర్తి చేయాలని పోలీస్‌ కవిూషనర్‌ ముందుగా వారం నుంచి చెప్తున్న మాటలను ఎవరు పాటించలేదనే చెప్పవచ్చు. తెల్లవారి 3 గంటలవరకు ఈ నిమజ్జనం కొనసాగింది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకొకుండా పూర్తవడంతో పోలీస్‌లంతా ఊపిరి పీల్చుకున్నారు.