వైభవంగా నాగుల చవితి వేడుకలు
-కిటకిటలాడిన శైవక్షేత్రాలు
కరీంనగర్,అక్టోబర్ 23 (జనంసాక్షి): హిందువులు ఎంతో పవిత్రమాసంగా భావించే కార్తీక మాసంలో తొలి సోమవారం కావడంతో శివాలయాలన్నీ కూడా ఉదయం 5 గంటల నుంచే భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. కార్తీక మాసంలో శివుడిని పూజిస్తే ఎలాంటి అవరోదాలున్నాకూడా తొలగిపోతాయని ప్రతీతి. అంతే కాక
ఈరోజు నాగుల చవితి కూడా తోడవడంతో చాలా మంది పుట్టలో పాలు పోసేందుకు తహతహలాడారు. పిల్లాపాపలతో కుటుంబ సమేతంగా దేవాలయాలకు చేరడంతో ప్రతి దేవాలయం, అందునా శివాలయాలు క్రిక్కిరిసిపోయాయి.