వైరస్ లక్షణాలు ఉన్న ఆవు, దూడల రక్తం శాంపిల్ తీసుకెళ్లిన జిల్లా పశు వైద్య బృందం
ఇమ్మ్యూనిటి టీకాల కొరకు పల్లెల్లోవిసృత ఏర్పాట్లు సిద్దం చేసిన
ఏ డీ పశు వైద్య అధికారి సుభాష్
ఎల్లారెడ్డి, అక్టోబర్ 8 (జనం సాక్షి ): ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ఉమ్మడి జిల్లా పశు వైద్య పరిశోధన కేంద్రం నుండి శనివారం ఎల్లారెడ్డి లోని సిరి గోశాల లో గత మూడు రోజుల క్రిందట దూడ చర్మ వ్యాధి తో మృతి చెందినవిషయం తెలిపామని.అన్నారు పశు వైద్యదికారులు ముద్ద చర్మ వ్యాధి(లాంఫి స్కిన్ )నిరోధక టీకాల కార్యక్రమం ను శనివారం నుండి పల్లె ప్రాంతాల్లో పశువుల పెంపకం దార్ల కు అవగహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పశువులకు వైరస్ సోకకుండా ఇమ్యునిటి టీకాలు వేయడం కొరకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు. ఏ డీ సుభాష్ శనివారం విలేఖర్లకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ మృతి చెందిన దూడ తల్లి రక్తాన్ని మరియు రెండు సంవత్సరాలు ఉన్న దూడ రక్తం ఈ రెండు రక్త నమోనాలను తిసుకోపోవాడనికి నిజామాబాద్ పశు వైద్య శాల అసిస్టెంట్ట్ డైరక్టర్ కిరణ్ దేశ్ పాండే ఆధ్వర్యం లో అనిమల్ ల్యాబ్ బృందం మధ్యానం ఎల్లారెడ్డి సిరి గోశాల చేరుకొని రక్త నమూనాలను తీసుకొని హైదరాబాద్ ల్యాబ్ కు పరీక్షల నిమిత్తం పంపించామని తెలిపారు. ముందు జాగ్రత్తగా పశువులకు గొట్ ఫ్యాక్స్ టీకాలను వేస్తున్నామని తెలిపారు.ఈ లాంఫి వైరస్ సోకినా పశువులు శరీరం పై గడ్డలు, పుండ్లు,దద్దురులు రావటం,కాళ్లకు వాపులు రావటం, గడ్డలు పగిలి రక్తం కారటం వ్యాధి ముదిరితే పశువు చనిపోవటం జరుగుతుందని రైతులకు వివరించారు. జిల్లా వ్యాప్తంగా 7,350 పశువులకు ఉచ్చితంగా వ్యాక్సిన్ (టీకాలు) వేయటం జరిగిందని ఫోన్ ద్వారా జిల్లా పశువైద్య అధికారి డి.వి. ఏ. హెచ్.ఓ భరత్ తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ అర్చన,అసిస్టెంట్ రమేష్ , పశు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.