వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు ఉపాధి.

ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్.
తాండూరు జులై 27(జనంసాక్షి)
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం
అయ్యప్ప నగర్ లో నివాసం ఉంటున్న ఇంద్రమ్మ అనే మహిళకు జీవనో పాధి కోసం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ కుట్టు మిషన్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవనోపాధి కోసం తన దృష్టికి రావడంతో వెంటనే స్పందించి
పేద మహిళలకు సహాయం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు సహాయం చేయడమే తన ముఖ్య లక్ష్యం అన్నారు. వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో వైష ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్, కోశాధికారి ఆగిరి మహేష్ కుమార్, సభ్యులు ప్రమోద్ కుమార్ మరియు పెద్దేముల్ సొసైటీ చైర్మన్ ద్యావరీ విష్ణువర్ధన్ రెడ్డి, తెరాస సీనియర్ నాయకులు గాజుల వీరప్రసాద్,
తదితరులు పాల్గొన్నారు.