వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే రోగాలు దరిచేరవు డాక్టర్ రాజకుమారి

మహాముత్తారం అక్టోబర్10( జనం సాక్షి)  ఈ వర్షాకాలంలో  వైరల్ ఫీవర్ రాకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత తప్పకుండా  ప్రతి ఒక్కరూ పాటించినట్లయితే రోగాలు మన దరిచేరవని డాక్టర్ రాజకుమారి అన్నారు. సోమవారం మండలంలోని వజినేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద  గ్రామ సర్పంచ్ గోక స్వర్ణలత సదానందం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ క్యాంపు లో 61 మంది రోగులకు వారికి సంబంధించిన మందులు అందజేశారు. సంబంధిత వ్యాధుల పట్ల వారికి తగు సూచనలు చేస్తూ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లకుండా అందుబాటులో ఉన్న జిల్లా కేంద్రంలో వంద పడకల  ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. అనంతరం డాక్టర్ రాజకుమారి మాట్లాడుతూ వజినేపల్లి గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని గ్రామ సర్పంచ్ గారు కోరడంతో ఈరోజు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని వారు అన్నారు. గ్రామములో రోడ్లకు ఇరుపక్కల కానీ ఎక్కడ  నిల్వ మురుగు నీరు లేకుండా గ్రామ సర్పంచ్ గారు చూసుకుంటారు కానీ మన ఇంటిలో ఇంటి చుట్టూ పిచ్చిమొక్కలు నిల్వ నీరు లేకుండా దోమలు ఈగలు  లేకుండా ఎప్పటికప్పుడు కి పరిశుభ్రం చేసుకుంటూ వ్యక్తిగత పరిశుభ్రత ను తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించినట్లైతే రోగాలను అరికట్టవచ్చని వారు గ్రామస్తులకు తెలిపారు. గ్రామ సర్పంచ్ గోక స్వర్ణలత మాట్లాడుతూ సంబంధిత వ్యాధులు ఉన్నవారు డాక్టర్ చెప్పిన సూచనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని  అన్నారు. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి మీ సహాయ సహకారాలు అందించి నందుకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజకుమారి, గ్రామ సర్పంచ్ గోక స్వర్ణలత సదానందం, ఏఎన్ఎం మంజుల, ఆశా వర్కర్ నిర్మల, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.