వ్యక్తిగత ప్రతిభకే కంపెనీల ప్రాధాన్యం

ప్రధాన సంస్థలో చదివినా పట్టించుకోని వైనం
ముంబై,మే18(జ‌నం సాక్షి ): ఎంఎన్‌సిలు ఉద్యోగులను ఎంపిక చేసుకోవడంలో వినూత్నంగా ఆలోచిస్తున్నారు. కేవలం ఐఐటిల్లో చదివిన వారే తెలివికలవారని భావించడం లేదు. సాధారణ డిగ్రీ చేస్తున్న వారిలో కూడా చురుకైన వారిని గుర్తించి ఎంపిక చేస్తున్నారు. వారికి తమకు అనుగుణంగా శిక్షణ ఇస్తున్నారు. ఇటీవల ఎంపిక ప్రక్రియలన్నీ ఇలానే జరుగుతున్నాయని ప్రైవేట్‌ కన్సల్టెన్సీకి చెందిన వారు విశ్లేషిస్తున్నారు. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు కూడా  భారీ వేతనానికి కొలువును సొంతం చేసుకుంటున్నారు.   దీనిని బట్టి చదువు ఎక్కడ చదివినా అది తమ సంస్థకు ఉపయోగపడే తెలివితేటలుఅ తడికి లేదా ఆమెకు ఉన్నాయా అన్నది చూస్తున్నారు. కేవలం ఐఐటిల్ల చదివతేనే తెలివికల వారన్న ధోరణి మారింది. అందుకే ఇంజనీరింగ్‌ కాలేజీల్లోనే కాదు, ఐఐటీల్లో చదివినా ఉద్యోగాలు రావడం లేదని ఇటీవల జరిగిన సర్వేలో తేలింది. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం  దేశం మొత్తం విూద 23 ఐఐటీలు ఉండగా 17 ఐఐటీలలో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను ఈ నివేదికలో పొందుపరిచారు. వీటిలో 2014-15 సంవత్సరంలో 79 శాతం, 2015-16లో 78 శాతం మందికి ఉద్యోగాలు లభించగా, 2016-17 సంవత్సరానికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో 66 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. ముఖ్యంగా 17 ఐఐటీలలోచదువు పూర్తి చేసుకున్న 9,104 మంది పట్టభద్రుల్లో  6,014 మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలలో మొత్తం 75,000 మంది విద్యార్ధులు చదువుతున్నారు.  ఇకపోతే ఇంజనీరింగ్‌లో గొప్పలు చెప్పుకునే తెలుగు రాష్ట్రాల్లో అసలు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లలో కనీసం 5శాతం దాటడం లేదు. ఇదంతా నైపుణ్య లోపాలుగానే భావిస్తున్నారు. కాలేజీల్లో నైణ్యాలకు కొదవ ఉందంటున్నారు. ఇకపోతే ఇంజనీరింగ్‌ కాదని డిగ్రీ విద్యార్థులను ఈ మధ్య భారీగా రిక్రూట్‌ చేస్తున్నారు.