వ్యవసాయం తరవాత గొర్రెల పెంపకానికి ప్రాధాన్యం

వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి

వనపర్తి,జూలై19(జనం సాక్షి): వ్యవసాయం తర్వాత గొర్రెల పెంపకానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. అందుకే సబ్సిడీపై గొర్రెల యూనిట్లు మంజూరు చేస్తున్నామనిఅన్నారు. మంగళవారం పెబ్బేరులో ఉచిత నీలి నాలుక వ్యాధి వ్యాక్సినేషన్‌ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాదికి నాలుగు సార్లు ఉచితంగా నట్టల నివారణ మందులు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఒక్క పెబ్బేరు గ్రామంలో 6 వేల సబ్సిడీ గొర్రెలకు గాను రూ.2.5 కోట్లు ఖర్చు చేశామన్నారు. నాలుగు లక్షల గొర్రెలకు ఉచిత మందులు పంపిణీ చేశామని మంత్రి వెల్లడిరచారు. అంతకుముందు వనపర్తిలో 80 మంది ముఖ్యమంత్రి సహాయనిధి లబ్దిదారులకు రూ.33 లక్షల 64 వేల విలువైన చెక్కులు, 11 మంది కులాంతర వివాహం చేసుకున్న జంటలకు రూ.2.5 లక్షల విలువైన చెక్కులను అందజేశారు కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.