వ్యవసాయరంగ దిశా దశ మార్చిన మోడీ ప్రభుత్వం..

రైతుల సంక్షేమం ,అభివృద్ధి కోసం లక్షల కోట్లు ఖర్చు .
శంకరపట్నం జనం సాక్షి అక్టోబర్ 17
* పీఎం కిసాన్ సమ్మన్ నిధి కింద సోమవారం 16 వేల కోట్ల మరియుఇప్పటివరకు రూ2.16 లక్షల కోట్లు విడుదల.. చేయడం జరిగింది.

* రాష్ట్రంలో రైతు వ్యతిరేక టిఆర్ఎస్ ప్రభుత్వం…

రైతులకు పీఎం సమ్మన్ నిధి 12 వ విడత నిధుల విడుదల లో బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగా డి కృష్ణారెడ్డి పేర్కొన్నారు.

బీజేపీ మోడీ ప్రభుత్వం 8 ఏళ్ల పాలనలో వ్యవసాయ రంగాన్ని నూతన విధానాల వైపు మళ్లించి , వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిందని, రైతన్న ల అభ్యుదయం కోసం నిరంతరం పటిష్ట చర్యలు తీసుకొని రైతులను రాజు చేయడానికి నిర్విరామంగా కృషి చేస్తుందని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగా డి కృష్ణ రెడ్డి తెలిపారు. రైతులకు పీఎం సమ్మాన్ నిధి12 విడత కింద సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ నిధుల చేసిన సందర్భంగా శంకరపట్నం మండలంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూఇన్నేళ్ళ స్వతంత్ర భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని గత పాలకులు నిర్వీర్యం చేశారని, రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి కల్పించారని విమర్శించారు. కానీ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగం పై ప్రత్యేక దృష్టి సారించి, రైతును రాజు చేయడానికి 8 ఏళ్ల పాలనలో అనేక పథకాలు తీసుకువచ్చి రైతు శ్రేయస్సు కోసం నిరంతర కార్యక్రమాలు చేపడుతూనే ఉందన్నారు . ముఖ్యంగా
పేద, మద్యతరహా రైతులకు ప్రతి ఏటా మూలధన పెట్టుబడి కోసం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంతో 2018 నుండి సంవత్సరానికి 6,000 రూపాయలు రైతులకు అందిస్తుందని తెలిపారు. ఇప్పటివరకు 12 విడతల్లో దాదాపుగా 2.16 లక్షల కోట్లు ఇందుకోసం ఖర్చు చేసిందని తెలిపారు .పంట భూముల సారాన్ని తెలుసుకోవడం కోసం మొదటిసారి సాయిల్ హెల్త్ కార్డులను ప్రవేశపెట్టిందని, ప్రకృతి భీభత్సాల నుండి రైతులను రక్షించి ఆదుకోవడానికి ఫసల్ బీమా పథకాన్నితీసుకవచ్చిందన్నారు. కెమికల్ పరిశ్రమలకు యూరియాను అక్రమంగా తరలించకుండా ఉండటం కోసం “నీం కోటెడ్” పెద్ద ఎత్తున తయారు చేయడంతో, యూరియా పుర్తిగా రైతులకు అందుబాటులొ దొరుకుతుందని,. తద్వారా ఒకప్పుడు యూరియా కోసం రైతు సోదరులు లైన్లలొ నుంచోని లాఠీదెబ్బలు తినే రోజులకు స్వస్తి పలికినట్టయిందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ,ముడి పదార్థాల ధరలు విపరీతంగా పెరిగిన దేశ రైతుల కు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా మోడీ ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేసి భారీ సబ్సిడీ పై ఎరువులు అందిస్తున్న ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
ముఖ్యంగా రైతులపై ఎరువుల భారం పడకుండా ఇటీవల తక్కువ ధరకు అందించడానికి వీలుగా కేంద్రంలోని బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. డి ఏ పి, నైట్రోజన్, పొటాషియం, పాస్పరస్, ఎరువులకు సబ్సిడీ అందించడానికి రెండు లక్షల కోట్లకు పైగా ఖర్చు చేస్తుందని వివరించారు. ఒక బస్తా డీఏపీ ధర 3,851 ఉందని, సబ్సిడీ పొందే రైతులు 1,350 కె ఒక ఒక బస్తా పొందే విధంగా సబ్సిడీతో అందిస్తున్న విషయం రైతులు గ్రహించాలన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎంత రాసిన దానికి ఫెర్టిలైజర్ ల ధరలు పెరిగినా దేశంలో రైతులపై కేంద్రం భారం మోప లేదన్నారు. రైతుల పై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం లాంటిదన్నారు.రైతు తన పంటను దేశంలొ ఎక్కడైనా ఆన్‌లైన్ ద్వారా అమ్ముకునేందుకు ఈనాం అనే పోర్టల్ ను ప్రవేశ పెట్టిన ఘనత మోడీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. అలాగే దేశంలొ వివిధ ప్రాంతాలలొ పండించే కూరగాయలు,పండ్లను వేగంగా ఆయా ప్రాంతాలకు తరలించడం కోసం ప్రత్యేకంగా కిసాన్ రైళ్లను ప్రవేశ పెట్టారని , ఇందులో భాగంగా ఇప్పటి వరకు 200 కిసాన్ రైళ్ళను నడపటం గొప్ప విషయమన్నారు. రైతు తన ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునే విధంగా, ఎంతకైన అమ్ముకునే హక్కులను కల్పించే నూతన వ్యవసాయ చట్టాన్ని మోడీ ప్రభుత్వం తీసుకువస్తే అమలు జరగకుండా కొంతమంది దుష్టశక్తులు , దళారులు అడ్డుకుని ,రైతులకు మేలు జరగకుండా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2014 సంవత్సరంలొ 1300రూపాయలుండే వరి పంట కనీస మద్దత్తు ధరను నేడు 2040 రూపాయలకు మోడీ ప్రభుత్వం పెంచిందని, ప్రతి యేటా రైతుల పంట మద్దతు ధర ను మోడీ ప్రభుత్వం గణనీయంగా పెంచుతుందనే విషయాన్ని రైతు సోదరులందరు గ్రహించాలని కోరారు.దేశంలొ మొదటిసారి సామాన్య రైతు సోదరులకు కూడా మోది ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రవేశ పెట్టిందని,. తద్వారా రైతులు తక్కువ వడ్డీలకు ఋణాలు తీసుకునే అవకాశం కల్పించారని పేర్కొన్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా
ఇధనాల్ తయారీను ప్రొత్సహిస్థూ ,చెరుకు, మొక్కజొన్న పంటలను లాభసాటిగా చేస్తున్నారనితెలిపారు. మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం కట్టుబడి ఉందని ,రైతు వ్యవసాయాన్ని లాభసాటి చేయాలనే ఆకాంక్షతో మోడీ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. అలాగే రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆయన దుయ్యబట్టారు. పంటలు వేయవద్దని ఆంక్షలు విధించడం, పంటలు కొనుగోలు చేయని బెదిరించడం టిఆర్ఎస్ ప్రభుత్వానికి అలవాటుగా మార్చుకొని రైతులకు వ్యతిరేకంగా తయారైందన్నారు. పంట కొనుగోళ్లలో రైతులను నిలువు దోపిడీ చేస్తుందని, విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన టిఆర్ఎస్ ప్రభుత్వం చోద్యం చూస్తూ, రైతులు ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేస్తుందని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. ఇట్టి కార్యక్రమం బిజెపి కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు మందాడి జగ్గారెడ్డి మరియు మండల అధ్యక్షులు ఐలయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మాడ వెంకట్ రెడ్డి. జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి. కేశవపట్నం ఎంపీటీసీ టు ఏనుగుల అనిల్ జిల్లా కార్యవర్గ సభ్యులు జంగ జైపాల్ మండల ప్రధాన కార్యదర్శి అశోక్ మండల ఉపాధ్యక్షులు కాంతల రాజిరెడ్డి పెసరి వీరార్జన్ సుధాగొని శ్రీనివాస్. దాసరపు నరేందర్. ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు గౌరవేణి శ్రీనివాస్. St మోర్చా మండల అధ్యక్షులు సారయ్య. కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనారెడ్డి. మండల ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి. బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు. నూనె కొండల్. బొజ్జ సాయి ప్రకాష్. అఖిల్.మరియు వివిధ గ్రామాల బూత్అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు. మరియు నాయకులు పాల్గొనడం జరిగింది