వ్యవసాయానికి ఉపాధిని జోడిరచాలి
ఆదిలాబాద్,ఆగస్ట్26 (జనం సాక్షి ) : వ్యవసాయానికి ఉపాధిహావిూని అనుసంధానం చేయాలని రైతు సంఘాల నేతలు అన్నారు. రైతుల పండిరచి పంటకు ముందే మద్దతు ధర ప్రకటించాలన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవటం వల్ల సమస్య జఠిలమవుతుందని, సమస్య పరిష్కారానికి మార్గం చూసు కోవాలని విన్నవించారు. ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవడడం ద్వారా ఆత్మహత్యల నివారాణకు పాటుపడ వచ్చన్నారు. సాగుచేసిన పంటల దిగుబడులు రాక, అప్పుల ఊబిలో కూరుకుపోయి, పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చేమార్గం లేక ఆత్మహత్య చేసుకుంటున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకోవాలని అన్నారు. గ్రామాల్లో ఆత్మహత్యల నివారణ కోసం ప్రభుత్వం అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. వేసిన పంటలు, చేసిన అప్పులు తదితర విషయాలపై ఆరాతీశామని, వీటిని తట్టుకోలేకే రైతులు ఉసురు తీసుకుంటున్నారని అన్నారు.