వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి: తులసిరెడ్డి

విజయవాడ,నవంబర్‌29 (జనం సాక్షి):  రైతుల ముట్టడితోనైనా కేంద్రం కళ్లు తెరవాలని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని ఆయన సూచించారు. మోదీ ప్రభుత్వం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ చట్టాలు తేనె పూసిన కట్టులాంటివన్నారు. ఈ చట్టాలు ద్వారా రైతులకు సరైన గిట్టుబాటు ధర ఉండదని చెప్పారు. బీజేపీ మిత్రపక్షమైన అకాలీదళ్‌ పార్టీకి చెందిన కేంద్రమంత్రి హర్‌ సిమ్రత కౌర్‌ ఈ చట్టాలకు నిరసనగా రాజీనామా చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ 3 వ్యవసాయ చట్టాలకు వైసీపీ మద్దతివ్వడం శోచనీయమని తులసిరెడ్డి తెలిపారు.