వ్యవసాయ జేడీఏను నిలదీసిన రైతులు
వరంగల్ శాయంపేట:వడగళ్ల వానతో పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం అందించడంలో జాప్యం చేయడాన్ని నిరసిస్తూ సాయంపేట తహసిల్దారు కార్యాలయానికి వచ్చిన జేడీఏ నాగేశ్వర్‌రావును నిలదీశారు. ఆయన వాహనానికి అడ్డుగా నిలబడి నినాదాలు చేశారు. పోలీసుల సహాయంతో ఆయన అక్కడ్నుంచి బయటకు వెళిపోయారు.