వ్యవసాయ డిగ్రీ విద్యార్థులకు గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమం ద్వారా వృత్తి నైపుణ్యత
విద్యార్థిని విద్యార్థులకు రావే సర్టిఫికెట్స్ అందజేస్తున్న కెవికె సెక్రటరీ సత్యనారాయణ రెడ్డి
గరిడేపల్లి, సెప్టెంబర్ 28 (జనం సాక్షి): బియస్సి వ్యవసాయం డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమం ద్వారా వృత్తి నైపుణ్యత పొందగలరని కెవికె సెక్రటరీ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం కేవీకే గడ్డిపల్లిలో లోయోల అకాడెమీ డిగ్రీ పీజీ కాలేజ్ హైదరాబాద్ కు చెందిన బియస్సి వ్యవసాయ డిగ్రీ విద్యార్థుల గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమం ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థుల ఉద్దేశించి ప్రసంగించారు. కేవీకే శాస్త్రవేత్త పర్యవేక్షణలో విద్యార్థులు వివిధ గ్రామాలలో ఉంటూ వ్యవసాయ స్థితిగతులను అధ్యయనం చేస్తూ ఆతిద్య రైతు క్షేత్రాలను సందర్శిస్తూ కేవీకే లో నూతన సాంకేతిక పరిజ్ఞానం ను పంటల సాగులో మెలకువలను బోధిస్తూ విద్యార్థులకు కృషి అనుభవాన్ని కలుగ జేస్తున్నామని తెలియజేసారు. కెవికె ఇంఛార్జి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ లవకుమర్ మాట్లాడుతూ 3 నెలల పాటు విద్యార్థులు గ్రామంలలోనే ఉంటు గ్రామీణ స్థితి గతులు వనరులు రైతులు పంటల సాగులో ఆచరిస్తున్న పద్ధతులు నూతన సాగు విధానాలు సాంకేతిక పరిజ్ఞానం మొదలగు అంశాలు అధ్యయనం చేసి సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై ప్రదర్శనలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కలిపించాలని తెలియజేసారు. కేవీకే శాస్త్రవేత్తల సూచనల సలహాల ద్వారా గ్రామీణ కృషి అనుభవం పొందడం ప్రాక్టికల్ గా పంటల సాగు గురించి ఎంతో నేర్చుకొన్నామని ఇది ఎంతగానో ఉపయోగపడిందని రావే విద్యార్థులు హరీష్, రత్నాకర్, అక్షిత, సాత్విక, అక్షిత, రాణి ఉపగ్న దేవి, వంశీ వారియొక్క అనుభవాలను తెలియజేసారు. అనంతరం గ్రామీణ కృషి అనుభవం పూర్తి చేసుకొన్న విద్యార్థులకు ముఖ్య అతిధి కెవికె సెక్రటరీ సత్యనారాయణ రెడ్డి సర్టిఫికెట్స్ ని అందించారు.ఈ కార్యక్రమం లో కేవీకే శాస్త్రవేత్తలు నరేష్ , కిరణ్, ఆదర్శ్ , మాధురి, సుగంధి,నరేష్ లతో పాటు లయోలా యూనివర్సిటీ కి చెందిన 50 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Attachments area
|