వ్యవసాయ మార్కెట్ యార్డులలో పని చేస్తున్న హమాలీలకు డ్రస్సులు ఇవ్వాలి
-సిఐటియు జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి
గద్వాల రూరల్ జూలై 04 (జనంసాక్షి):- జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులలో పనిచేస్తున్న హమాలీలకు గత మూడు నాలుగు సంవత్సరాలుగా డ్రెస్సులు ఇవ్వడంలేదని ప్రతి సంవత్సరం రెండు జతల డ్రెస్సులు ఇవ్వాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఇప్పటికైనా వెంటనే జిల్లాలోని అన్ని మార్కెట్ యార్డులలో పనిచేస్తున్న హమాలీలకు డ్రెస్సులు ఇప్పించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి అధికారులను డిమాండ్ చేశారు
వ్యవసాయ మార్కెట్ యార్డులలో పనిచేస్తున్న హమాలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా మార్కెటింగ్ అధికారి పుష్ప గారికి వినతిపత్రం ఇచ్చారు..ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏ వెంకట స్వామి మాట్లాడుతూ
వ్యవసాయ మార్కెట్ యార్డులలో హమాలీలు విశ్రాంతి తీసుకొనుటకు విశ్రాంతి గది కేటాయించాలని అన్నారు విశ్రాంతి గది లేకపోవడం వల్ల మధ్యాహ్నం భోజనం కొరకు తెచ్చుకున్న టిఫిన్లు ఇతర సామాన్లుభద్రపరచుకొనుటకు అవకాశంలేక హమాలీలు చాలాఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే విశ్రాంతి గది కేటాయించాలని కోరారు…వినతి పత్రం ఇచ్చిన వారిలో వెంకటస్వామి తో పాటు అలంపూర్ చౌరస్తా వ్యవసాయ మార్కెట్ యార్డ్ హమాలీ యూనియన్ అధ్యక్షులు ఉస్మాన్ భాష, ప్రధాన కార్యదర్శి చిన్న సుంకన్న, కోశాధికారి మహేష్, ఉపాధ్యక్షులు పెద్ద వెంకటేశ్వర్లు,సహాయ కార్యదర్శి వెంకట్ తదితరులు ఉన్నారు….