వ్యవసాయ రంగానికి అనుకూలంగా లేని కేంద్ర బడ్జెట్

అశ్వరావుపేట ఫిబ్రవరి 25( జనం సాక్షి )

కేంద్ర బడ్జెట్ ప్రజా సంక్షేమాన్ని పూర్తి గా మరచి కార్పోరేట్ వర్గాలు కు అనుకూలంగా వుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కె పుల్లయ్య అన్నారు.శుక్రవారం కేంద్ర బడ్జెట్ లో రైతులు, కార్మిక, కూలీలకు,విద్య వైద్య రంగాలకు సరిపడ నిధులు కేటాయించాలని తాహశీల్దారు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా పుల్లయ్య మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి వున్న సబ్సిడీ లు తగ్గించి మోడీ రైతాంగం పై కక్ష తీర్చుకున్నారని , ఉపాధిహామీ పథకానికి నిధులు తగ్గించి పేదల పోట్టకోట్టేరని అన్నారు.ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా ప్రైవేటు చేయడం అంటే కార్మిక రంగాన్ని నడి రోడ్డు పైకి పెట్టటమే అని అన్నారు.ధరభారంతో ఇబ్బందులు పడుతున్నా సామాన్య ప్రజలు కు పెరుగుతున్న ధరలు తగ్గించే చర్యలు తీసుకోలేదని చెప్పారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పిట్టల అర్జున్, చిరంజీవి, నందు, గంగరాజు, అప్పన్న, అప్పారావు,తమ్మయ్య, మురళి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.