వ్యవసాయ శాఖ సర్వేకు సహకరించాలి

వనపర్తి,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న రైతు సమగ్ర సర్వేకు గోప్యత పాటించకుండా వివరాలు చెప్పాలని వనపర్తి జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి సుజాత సూచించారు.
పాన్‌గల్‌ మండలంలోని గోపులాపూర్‌ గ్రామంలో జరుగుతున్న సర్వేను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సర్వే కోసం ప్రభుత్వం ముద్రించిన దరఖాస్తును వివరించారు. రాబోయే రోజుల్లో రైతుకు సదుపాయాలు కల్పించడానికి ఈ సర్వే ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. గ్రామాలకు వచ్చే వ్యవసాయ విస్తరణ అధికారులకు రైతులు సమగ్రంగా వివరాలు ఇవ్వాలని కోరారు. ఆమెతో పాటు మండల వ్యవసాయ శాఖ అధికారిణి హరిత, విస్తరణ అధికారిణి మహేశ్వరి తదితరులు ఉన్నారు.
వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో చేపడుతున్న రైతు సమగ్రసర్వేకు రైతులు సహకరించాలని వ్యవసాయ అధికారిణి హరిత కోరారు. సోమవారం పాన్‌గల్‌ మండలంలోని గోపులాపూర్‌, రాయినిపల్లి, మహ్మదాపూర్‌ గ్రామాల్లో చేపట్టిన సర్వేను ఆమె పరిశీలించి మాట్లాడారు. రైతులు పొలాల్లో సాగు చేస్తున్న పంటల వివరాలు పూర్తిస్థాయిలో అందించాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు లింగస్వామి, మహేశ్వరి, నరేష్‌, శైలజ, వరుణ్‌ పాల్గొన్నారు.