వ్యాధులు సోగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి

జనం సాక్షి వెల్దుర్తి
వెల్దుర్తి మండలంలోని మానేపల్లి గ్రామంలో వెల్దుర్తి ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి జెడ్పిటిసి రమేష్ గౌడ్ అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించి వారికి పెడుతున్న పౌష్టికాహారం గురించి బాలింతలను మరియు పిల్లలను అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ముంచుకొస్తున్న ఈ తరుణంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని పరిసరాలను కూడా విధిగా ప్రతి ఒక్కరూ శుభ్రంగా ఉంచుకోవాలని శానిటేషన్ విషయంలో గ్రామపంచాయతీ కార్మికులతో ప్రతి ఒక్కరూ పని తీర్చుకోవాలని ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి తెలిపారు మానేపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో తనిఖీలు నిర్వహించి అనంతరం గ్రామంలోని మురుకు కాలువల పనితీరును ఆమె పర్యవేక్షించారు ఎక్కడ చెత్త లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత గ్రామస్తులదేనని అప్పుడే మనము సీజనల్ వ్యాధులకు గురికాకుండా ఉండవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో జిల్లా జిల్లా నరేందర్ రెడ్డి గ్రామ సర్పంచ్ వెంకటలక్ష్మి తదితర నాయకులు పాల్గొన్నారు
 
Attachments area