శనగపంట బీమా గడువు పొడిగించాలి

ఆదిలాబాద్‌,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): అతివృష్ఠి లేదా అనావృష్ఠి వల్ల పంటలు నష్టపోయిన సందర్భంలో రైతులను ఆదుకునేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకాన్ని అమలు చేస్తున్నా, ప్రచార లోపం కారణంగా అది రైతులకు అందలేదని సిపిఐ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అమలు చేస్తున్న పంట బీమా పథకం గడువు ముగిసిపోవడంతో అనేక మంది రైతులు ప్రీమియం చెల్లించలేకపోయారని సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్‌ అన్నారు. దీనిని పరిశీలించి రైతులకు అవాగహన కల్పించడంతో పాటు మరో పక్షం రోజులు గడువు పెంచాలని కోరారు. ఆదిలాబాద్‌ జిల్లాలో యాసంగిలో అధిక విస్తీర్ణంలో సాగయ్యే శనగ పంట కావడంతో ఇప్పటికే 28 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఈ ఏడాది శనగ పంటను గ్రామం యూనిట్‌ బీమా పథకం కింద తీసుకున్నారు. ఎకరానికి రూ.240 ప్రీమియాన్ని చెల్లించాలి. దీనికి ఈ నెల 30వ తేది వరకు గడువుగా నిర్ణయించారు.ఆదిలాబాద్‌ జిల్లాలో శనగ పంటను 50వేల మందికి పైగా రైతులు సాగు చేస్తున్నారు. చివరి రోజున మండల వందలాది మంది ఒకే సారి డీడీలు తీసుకోవడంతో బ్యాంకులో ఉన్న డీడీ బుక్‌లు అయిపోయాయి. శనగ పంటకు సంబంధించిన గడువు పొడిగించాలని కిసాన్‌సంఘ్‌ నాయకులు భూమారెడ్డి, అశోక్‌రెడ్డి తదితరులు కోరారు. వెబ్‌సైట్‌లో సమాచారం అందుబాటులో ఉంచకపోవడంతో వాటి కోసం రోజు విూసేవ చుట్టూ తిరిగారని, తీరా గడువు ఒక రోజు ఉందనగా డీడీలు తీయాలని చెప్పడం ఎంత వరకు సమంజసమన్నారు గడువు పొడిగించి శనగ పంటకు బీమా చేసుకునే అవకాశం కల్పించాలని వారు కోరారు బ్యాంకు నుంచి రుణం పొందిన రైతుల నుంచి బ్యాంకర్లు ప్రీమియాన్ని మినహాయించుకోని బీమా కంపెనీకి చెల్లిస్తారు. నేరుగా చెల్లించే రైతులు సంబంధిత కంపెనీకి విూసేవ ద్వారా చెల్లించాలని పెర్కొన్నారు.. అయితే ప్రీమియం చెల్లించేందుకు రైతులు విూసేవ కేంద్రాలకు వెలితే వెబ్‌సైట్‌ తెరుచుకోవడం లేదంటున్నారు.. గడువు చివరి రోజున డీడీలు తీయాలని చెప్పడంతో తెలిసిన కొంత మంది రైతులు మాత్రమే బీమా చేసుకున్నారు. దీనిని పొడిఒగించి రైతులందరికి వర్తింప చేయాలన్నారు. బీమాలో భాగంగా శనగ పంటకు గ్రామం యూనిట్‌ వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని ఐసీఐసీఐ లామ్‌బర్డ్‌ జీఐసీ లిమిటెడ్‌ సంస్థకు అప్పగించారు. అయితే ఆయా కంపెనీ అధికారులు, సిబ్బంది బీమా అమలుపై ప్రచారం చేయలేదు.. ఇటు వ్యవసాయాధికారులు అవగాహన కలిగించలేదు. ప్రీమియం చెల్లించేందుకు విూసేవకు వెలితే సమాచారం లేదని అధికారులకు చెప్పిన పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం చివరి రోజు కావడంతో వందలాది మంది రైతులు బ్యాంకుల్లో బారులు తీరారు. కొన్ని బ్యాంకుల్లో డీడీ బుక్‌లు కూడా అయిపోయాయని చెప్పడంతో రైతులు వెనుదిరిగి పోవల్సి వచ్చింది. యాసంగిలో సాగు చేసే పంటలలో జిల్లాకు శనగ పంటకు గ్రామం యూనిట్‌గా బీమా చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. విూసేవలో ప్రీమియం చెల్లించాలని తొలుత చెప్పారు. అక్కడికి వెళ్తే అందులో ఎలాంటి సమాచారం లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేయడంతో డీడీలు తీసి దరఖాస్తు చేసుకోవచ్చని గడువు తేదీకి ఒక రోజు ముందు అధికారులు చెప్పడంతో డీడీల కోసం రైతులు బ్యాంకుల్లో బారులు తీరారు. అయినా వారికి డిడిలు దక్కకపోవడంతో దిగాలు పడ్డారు.