శబరిమలైకు ఆర్టీసీ అద్దె బస్సులు
హైదరాబాద్: రైళ్లు నాలుగునెలల ముందే నిండిపోయాయి. విమాన టికెట్లు సామాన్యుడికి అందుబాటులో లేవు.. కార్లు అద్దెకు తీసుకుని వెళ్లలేని పరిస్థితి.. ఎలాగైనా నిర్దేశించిన కాలంలోనే శబరిమలైకు వెళ్లాలి.. ఎలా అని తలలు పట్టుకోకండి. మీరు ఒక బృందంగా మారితే.. మిమ్ములను సురక్షితంగా తీసుకెళ్లి తీసుకురాడానికి ఆర్టీసీ బస్సులు సిద్ధంగా ఉన్నాయని టీఎస్‌ఆర్టీసీ చెబుతోంది. మీకు అనువైన బస్సులను అద్దె ప్రాతిపదికన ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఇంటికి వచ్చి తీసుకెళతామని చెబుతోంది. అనుభవజ్ఞులైన డ్రైవర్లను ఇందుకోసం కేటాయిస్తున్నట్టు కూకట్‌పల్లి డీవీఎం దేవదానం చెప్పారు.
అద్దెలు ఇలా..
24గంటల్లో 480 కిలోమీటర్ల దూరం ప్రయాణం ఉండేలా అద్దెలు నిర్ణయించారు. ఇలా సూపర్‌లగ్జరీ బస్సు కావాలంటే కిలోమీటరుకు రూ.42 వసూలు చేస్తారు. డీలక్స్ బస్సులైతే రూ. 41, ఎక్స్‌ప్రెస్‌కు రూ.45 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇక మినీ ఏసీ(వజ్ర) బస్సులైతే.. ప్రతి కిలోమీటరుకు రూ.30తో పాటు 5శాతం జీఎస్‌టీ చెట్లించాల్సి ఉంటుంది.
పూర్తి వివరాలకు..
కూకట్‌పల్లి డివీఎంను 99592 26148, బీహెచ్‌ఈఎల్ డిపో మేనేజర్‌ను 99592 26149, మియాపూర్ – 1 డిపో మేనేజర్‌ను 99592 26153 ఫోన్ నంబర్లలో సంప్రదిస్తే.. మీ ప్రయాణికుల సంఖ్యను బట్టి బస్సులను సమకూర్చడం జరుగుతుంది.