శరణార్ధి శిబిరాలపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు
` 70 మంది సమితి సహాయ సిబ్బంది మృతి
గాజా సిటీ(జనంసాక్షి): ఇజ్రాయెల్ దాడులతో గాజా నగరంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రోజులుగా శరణార్థి శిబిరాలపైనా దాడులు జరుగుతుండటంతో గాజాలో సు రక్షిత ప్రాంతమనేదే కరవైందని ఐక్యరాజ్య సమితి సహాయక బృందాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో అక్టోబ రు 7 నుంచి ఇప్పటిదాకా సహాయక చర్యల్లో పాల్గొంటున్న వారిలో 70 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు ఐరాస రిలీఫ్ అండ్ వర్కర్స్ ఏజెన్సీ (యూఆర్‌డబ్ల్యూఏ) తెలి పింది. ఆ సంస్థ కమిషనరు ఫిలిప్ తొలిసారి గాజాలో సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బందిని పరామర్శించారు. ’మానవతా సాయంలో ఇలాంటి కఠిన పరిస్థితులను ఇప్పటి వరకూ చూడలేదు. మా సిబ్బందిలో చాలామంది విడిపోయారు. వారిలో కొంత మంది ఆచూకీ గల్లంతైంది. కానీ మా సిబ్బంది సహాయక చర్యలు కొనసాగించేందుకు నిరంతరం పని చేస్తున్నారు. గాజాలోని ప్రజలకు మద్దతుగా మా సహాయక చర్యలు కొనసాగుతాయి’ అని ఫిలిప్ తెలిపారు.