శవరాజకియాలు చేయడం మానుకోవాలి.
భారత రాష్ట్ర సమితి యువజన విభాగం నాయకులు సుంకపాక మనోజ్.రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చి 18. (జనంసాక్షి). ప్రతిపక్ష పార్టీల నాయకులు శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని భారత రాష్ట్ర సమితి యువజన విభాగం నాయకులు సుంకపాక మనోజ్ అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సిరిసిల్లలో ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు నవీన్ మృతి పట్ల సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నవీన్ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటుందని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బిజెపి నాయకుల వైఖరిని తప్పు పట్టారు. దేశంలో రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందో చెప్పిన తర్వాతే మాట్లాడాలని అన్నారు. యువకులు నిరాశకులను కావద్దని ప్రభుత్వం నోటిఫికేషన్లను ఇస్తూ ఉద్యోగాలను భర్తీ చేస్తుందని అన్నారు. సమావేశంలో కత్తెర వరుణ్ కుమార్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.