శశి థరూర్‌కు షాక్‌


– సునంద పుస్కర్‌ డెత్‌ కేసులో చార్జ్‌షీట్‌ దాఖలు

న్యూఢిల్లీ, మే14(జ‌నం సాక్షి) : సీనియర్‌ కాంగ్రెస్‌ లీడర్‌ శశి థరూరపై ఢిల్లీ పోలీసులు సోమవారం చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. తన భార్య సునంద పుస్కర్‌ మిస్టరీ డెత్‌పై ఆయనపై చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. సునంద ఆత్మహత్య చేసుకోవడానికి శశి ప్రేరేపించాడన్న నేరంతో ఆయనపై పోలీసులు చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఐపీసీ సెక్షన్‌ 498 ఏ, 306 కింద మెట్రోపాలిటన్‌ మెజిస్టేట్ర్‌ ధర్మేందర్‌ సింగ్‌ ఎదుట శశిథరూర్‌పై చార్జ్‌షీట్‌ నమోదైంది. అయితే.. సునంద చనిపోయిన నాటి నుంచి ఆ కేసులో నిందితుడిగానే ఉన్నాడు. సునంద చనిపోవడానికి రెండు రోజుల ముందు ఆమె శశిని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసి ఒంటరిగా ¬టల్‌కు ఎందుకు వెళ్లింది. కేరళ నుంచి ఢిల్లీ కి విమానంలో వస్తున్నప్పుడు కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే.. అప్పుడు జరిగిన ఈ పరిస్థితులపై పోలీసులు శశిథరూర్‌ను విచారించారు.
అయితే.. పుష్కర్‌ హత్యకు గురయినట్టు మార్చి 2018లో వెలువడిన ఓ రిపోర్ట్‌ తెలిపింది. కాని.. తనను ఎవరు హత్య చేశారనదే ఇప్పుడు మిస్టరీగా మారింది. ఆమె మరణంపై దర్యాప్తు చేసిన ఆఫీసర్లకు ఆమెను ఎవరు మర్డర్‌ చేశారో తెలుసని ఓ వార్తా సంస్థ కథనాన్ని కూడా ప్రచురించింది. సునంద సౌత్‌ ఢిల్లీలోని ఓ రేవ్‌ స్టార్‌ ¬టల్‌లో జనవరి 17, 2014 న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తన భర్తకు పాకిస్థానీ జర్నలిస్ట్‌తో అ్గ/ర్‌ ఉందని ఆమె ఆరోపించిన కొన్ని రోజులకే సునంద మృతి చెందడంతో ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే.. ఆమెకు విషం ఇవ్వడం వల్లనే ఆమె చనిపోయిందని.. జనవరి 2015లో నిందితులెవరినీ చేర్చకుండా మర్డర్‌ కేసును పోలీసులు రిజిస్టర్‌ చేశారు.