శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు
హుస్నాబాద్ సిఐ ఎర్రల కిరణ్
హుస్నాబాద్ రూరల్ సెప్టెంబర్ 21(జనంసాక్షి) రౌడీషీటర్లు శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హుస్నాబాద్ సిఐ ఎర్రల కిరణ్ హెచ్చరించారు.హుస్నాబాద్ సిఐ కార్యాలయంలో సర్కిల్ పరిధిలోని హుస్నాబాద్,అక్కన్నపేట మరియు కోహెడ మండలాలకు సంభందించిన మండలంలో ఆగడాలకు పాల్పడుతోన్న రౌడీ మూకల్ని పోలీస్ స్టేషన్‌కి పిలిచి సిఐ ఎర్రల కిరణ్ కౌన్సెలింగ్ నిర్వహించారు.రౌడీ షీట్ కలిగిన సుమారు 12 మంది అనుమానితులకు పోలీసులు హితబోధ చేశారు.సరైన నడవడికతో ఉండాలని ఎలాంటి ఆసాంఘీక కార్యకలాపాలు చేయుద్దని హెచ్చరించారు.నేరాలు, దౌర్జన్యాలు, అక్రమాలు, బెదిరింపులకు సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.జీవించడానికి సదరు వ్యక్తులంతా ఏయే వృత్తుల్లో ఉన్నారు అనే విషయాలను నమోదు చేసుకున్నారు.రౌడీ షీటర్లు ఎటువంటి శాంతి భద్రతల సమస్య సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు.అంతేకాకుండా చెడు వ్యసనాలకు బానిసలై కొందరు అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారని వారిపై కూడా చట్ట పరమైన చర్యలు చేపడతామన్నారు.నిరంతరం వారిపై నిఘా ఉంటుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎస్సై శ్రీధర్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.