శాకంబరి దేవిగా దర్శనం ఇచ్చిన శ్రీ రేణుక ఎల్లమ్మ.

తాండూరు జులై 26(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం వాల్మీకి నగర్ లో వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని ఆలయ ఆర్చకులు శాంకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మంగళవారం ఆషాడ మాసం పురస్కరించుకొని ఈ ఆలయంలో కొలువుదీరిన శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారిని వివిధ కూరగాయలు పండ్ల తో అలంకరించి శాకాబరీ దేవి గా దర్శనం కల్పించారు. దీంతో పట్టణ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని శాకంబరి దేవిగా అమ్మవారిని దర్శించుకుని తరించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో
ఆలయ కమిటీ అధ్యక్షుడు ధార్మిది. రవిశంకర్, పూజారి పాండు, సునీల్ కుమార్, సతీష్, నగేష్ , శెట్టి శరణు, ఎం. నాగరాజు ,మహిళా మండలి అధ్యక్షురాలు ధర్మిది చంద్రకళ,ఆలయ అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.