శిక్షణ భవనాన్ని సందర్శించిన అపార్డ్ డైరెక్టరు
గీసుకొండ: మండలంలోని ఆదర్శ గ్రామమైన గంగదేవి పల్లి గ్రామంలో అపార్డ్ సంస్థ నిర్మిస్తున్న శిక్షణ భవనాన్ని జాయింట్ డైరెక్టరు నాగరాజు బుధవారం పరిశీలించారు. ఈ నెలాఖరులో భవనాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులకు ఈ భవనంలో శిక్షణ ఇస్తారు. ఆయన వెంట అపార్డ్ ఇంజినీరింగ్ అధికారి కె. లక్ష్మీపతి, మాజీ సర్పంచి కూసం రాజమౌళి పాల్గొన్నారు.