*శిథిలావస్థకు చేరిన వంతెనపై నూతన బ్రిడ్జి నిర్మిచాలి..*
*దేవరుప్పుల ,అక్టోబర్ 21(జనం సాక్షి): దేవరుప్పుల మండలం,నీర్మాల నుండి వనపర్తి గ్రామానికి,లింగాల ఘనపురం మండలానికి వెళ్లే దారిలో ఉన్న పురాతన వంతెన శిథిలావస్థకు చేరి పూర్తిగా ధ్వంసంమైందని రైతులు ఆందోళన చెందుతున్నారు.ఈసందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ….ఈ వంతెన నుండి రైతులు వ్యవసాయ పనులకోసం ప్రతిరోజు ట్రాక్టర్ లు,బండ్లు, ఆటోలు వస్తూ పోతూ ఉంటాయని
గతంలో పైపులు వేసి వంతెన నిర్మించారని
కానీ ఈ వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా కురియడంతో ఈ వంతెన పూర్తిగా ద్వంసమైందని
రైతులు ఈ మార్గం నుండే వనపర్తికి గ్రామానికి,లింగాల ఘనపురం మండలానికి నిత్యం వెళతారని కావున స్థానిక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చొరవ తీసుకొని తక్షణమే ఈ వంతెనపై ఓవర్ బ్రిడ్జి నిర్మించేందుకు పనులు చేపట్టాలని ఈ మార్గం గుండా నిత్యం వెళ్లే రైతులు ఈ వంతెన ఎప్పుడు కూలుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారని అందుకని తక్షణమే బ్రిడ్జిని నిర్మించాలని వాళ్ళు డిమాండ్ చేశారు.
ఈకార్యక్రమంలో సింగారపు రమేష్,కాడబోయిన వెంకన్న,ఇంటి వెంకట్ రెడ్డి,మేడ రాంచంద్రు,పయ్యావుల భిక్షపతి,మల్లయ్య,అంజయ్య,తదితరు లు పాల్గొన్నారు.
Attachments area