శిశువు మృతిలో బంధువుల ఆందోళన
కామారెడ్డి,అగస్టు23(జనంసాక్షి): కామారెడ్డి జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ సమయంలో ఆడ శిశువు మృతి చెందింది. అయితే వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందిందంటూ బంధువులు ఆందోళనకు దిగారు. రామారెడ్డి మండలం సింగరాయపల్లికి చెందిన సౌందర్య అనే గర్భిణీ ప్రసవం కోసం నిన్న కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆమెకు ఆడ శిశువు జన్మించగా…పుట్టగానే శిశువు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో బంధువులు ఆందోళనకు దిగారు.