శ్రమజీవుల హక్కుకోసం సిపిఐ నిరంతర పోరాటం
వినుకొండ, జూలై 19 : శ్రమజీవుల హక్కుల కోసం సిపిఐ నిరంతరం పోరాడుతుందని ఆ పార్టీ ఏరియా కన్వీనర్ వరప్రసాద్ తెలిపారు. గురువారం వినుకొండ మండలంలోని కొప్పుకొండ తండాలో సిపిఐ నూతన శాఖ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వరప్రసాద్ మాట్లాడుతూ తండా వాసులకు పంపిణీ చేసిన భూమికి హద్దులు నిర్ణయించాలని కోరారు. వారి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి పుల్లయ్య, మండల కార్యదర్శి శ్రీనివాసరావు, బ్రహ్మయ్య, హనుమానాయక్, మంత్రునాయక్ తదితరులు పాల్గొన్నారు.