శ్రీకాకుళం ఘటన పై సీఐడీ సమగ్ర దర్యాప్తు
శాంతి భద్రతల విభాగం డైరెక్టర్ జనరల్ ఎన్.ఎ.హూడా
హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేట ఘటన పై నేర పరిశోధన విభాగం సమగ్ర దర్యాప్తు జరుపుతోందని శాంతి భద్రతల విభాగం డైరెక్టర్ జనరల్ ఎన్.ఎ.హూడా పేర్కొన్నారు. ఈనెల 12న దళితులపై జరిగిన దాడిలో 65మంది నిందితులను గుర్తించినట్లు ఆయన తెలిపారు. అసలు నిందితులెవరు, వారి వెనుక నేరపూరిత కుట్రకు పాల్పడిందేవరనే కీలక సమాచారిన్న సీఐడీ సేకరించినట్లు హూడా వెల్లడించారు. ఈ ఘటనలో పోలీసు వైఫల్యంపై కూడా సీఐడీ పరిశీలన జరుపుతున్నట్లు తెలిపారు. సీఐడీ ఆడిషనల్ ఎస్పీ రమణారావు నేతృత్వంలో ఓ బృందం వంగర, రాజాంలో విచారణ చేస్తుందన్నారు. అంతేకాకుండా సీఐడీ ఇన్‌చార్జీ అదనపు డీజీపీ గోపాల్‌రెడ్డి శ్రీకాకుళం వెళ్లి దర్యాప్తును పర్యవేక్షిస్తున్నట్లు హుడా వెల్లడించారు.