శ్రీలంకపై కివీస్ దే పైచేయి
దున్ దిన్: శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ ను న్యూజిలాండ్ చేజిక్కించుకుంది. శుక్రవారం జరిగిన చివరి వన్డేలో న్యూజిలాండ్ 108 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ ను కైవశం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 360 పరుగుల చేసి లంకేయులకు సవాల్ విసిరారు.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన లంకేయులు 43.4 ఓవర్లలో 252 పరుగులకే పరిమితమై ఓటమి చెందారు.టిమ్ దిల్షాన్(116), తిరుమన్నే(45) పరుగులు చేసినప్పటికీ శ్రీలంకకు విజయాన్ని అందివ్వలేకపోయారు. అంతకుముందు జరిగిన తొలి, నాలుగో వన్డేలో న్యూజిలాండ్ విజయం సాధించింది. మూడో వన్డే వర్షం కారణంగా రద్దవ్వగా, రెండో వన్డేలో లంకేయులు విజయం సాధించారు.



