శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

హుజూర్ నగర్ సెప్టెంబర్ 24 (జనం సాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో బతుకమ్మ ఉత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించామని ప్రిన్సిపాల్ పోసాని వెంకటరమణారావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయాలని ఈ బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించామని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులు మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకొని వాటిని పాటించాలన్నారు. మన సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఒక్కరిని గౌరవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జులు ప్రేమ్ సాగర్, సౌజన్య, సంధ్య , ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.