శ్రీ మంజునాథ బెంగళూరు అయ్యంగార్ బేకరీ ప్రారంభించిన ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్
గరిడేపల్లి, అక్టోబర్ 14 (జనం సాక్షి): మండల కేంద్రమైన గరిడేపల్లి లో బెంగళూరు వారు నూతనంగా ప్రారంభించిన శ్రీ మంజునాథ బెంగళూరు అయ్యంగార్ బేకరీ ని ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్ లాంచనంగా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బెంగళూరు వారు మన గరిడేపల్లి లో పెద్ద ఎత్తున బేకరీని ప్రారంభించి రుచికరమైన కొత్తరకం బేకరీ ఐటమ్స్ స్వీట్స్ ను అందించడం ఆనందకరమన్నారు. బర్త్డేలు ఎంగేజ్మెంట్లకు వివిధ శుభకార్యాలు జరిపేవారు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. వ్యాపారం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పూజారి కృష్ణశాస్త్రి, సీనియర్ జర్నలిస్టు తాటికొండ లక్ష్మణ్, తోడేటి వెంకటేశ్వర్లు, రిటైర్డ్ ఎంఈఓ నలబోలు వెంకటరెడ్డి, త్రిపురం జానకిరామ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, పెండెం ఫణిందర్, శ్రీను, కానుగు విజయ్, మీరా, సీతారాములు, భద్రయ్య, లింగారెడ్డి, సైదులు, శ్రీ మంజునాథ బెంగళూరు అయ్యంగార్ బేకరీ నిర్వాహకులు సందీప్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.