శ్రీ మహా చక్ర శరత్ కాల మహోత్సవం – పూర్ణాహుతి పూజలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు
కొడకండ్ల, అక్టోబర్09( జనంసాక్షి )
జనగామ జిల్లా కొడకండ్లలోని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో జరుగుతున్న శ్రీ మహా చక్ర శరత్ కాల మహోత్సవం – పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.ఈ సందర్భంగా మంత్రి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. మంత్రికి పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికి, ఆశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొడకండ్లలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో జరుగుతున్న శ్రీ మహా చక్ర శరత్ కాల మహోత్సవం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టమన్నారు. అమ్మ వారి దయతో సీఎం కెసిఆర్ గారి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని,ప్రజలుసుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. సీఎం కెసిఆర్ గారి నాయకత్వములో దేశం రాష్ట్రం లాగే, అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరువెంకటేశ్వరరెడ్డి,తెలంగాణ రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ అందె యాకయ్య, బి ఆర్ ఎస్ మండలపార్టీ అధ్యక్షుడు సిందే రామోజీ,స్థానిక సర్పంచ్ పసునూరి మధుసూదన్, ఎం పి టి సి కుందూరు విజయలక్ష్మి, మార్కెట్ డైరెక్టర్ కుందూరు అమరెందర్ రెడ్డి, రాజరాజేశ్వరి దేవాలయ సిద్ధాంతి గౌతమ్ శర్మ,మండల యూత్ అధ్యక్షుడు దేశగాని సతీష్, స్థానిక ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, స్థానిక ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.