శ్రీ శ్రీ శ్రీ జమ్ములమ్మ దేవాలయ ప్రాంగణంలో అష్టదశ శక్తి పీఠాల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) ఆగస్టు 5 : జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ జములమ్మ దేవాలయం ప్రాంగణంలో అష్టశక్తి పీఠాలలో కొలువైన అమ్మవారి విగ్రహాలను నిర్మాణం పనులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి పరిశీలించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ

నడిగడ్డ ఇలవేల్పు అయిన జమ్మలమ్మ దేవస్థానంలో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర , తమిళనాడు ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసి తమ మొక్కులను తీర్చుకొవడానికి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందని తెలిపారు.
దేవాలయంలో ప్రత్యేకమైన అష్టాదశ శక్తిపీఠాలు 18 అమ్మవారి విగ్రహాలు ప్రతిష్టించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎక్కడ లేని విధంగా ప్రత్యేకంగా గద్వాల జమ్ములమ్మ దేవాలయంకు భక్తులకు ప్రపంచ నలుమూలల ఉన్న అమ్మవార్లను దర్శించుకునే అవకాశం కల్పించడం
అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
దసరా నవరాత్రులు ఉత్సవాలకు ముందే ప్రతిష్ట కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆలయ ఛైర్మన్, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బియస్ కేశవ్, ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చెన్నయ్య వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మ, ఆలయ కమిటీ చైర్మన్ సతీష్, కౌన్సిలర్స్ నాగిరెడ్డి కృష్ణ, గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షుడు గోవిందు, మండలం పార్టీ అధ్యక్షుడు రాముడు, తెరాస పార్టీ నాయకులు భగీరథ వంశీ,కురుమన్న, రాముడు తదితరులు పాల్గొన్నారు.