శ్రీ సంతోషిమాత దేవాలయము భక్తుల కోసం బట్ట సంచులు.
ఆలయ చైర్మన్ మాంకాల నవీన్ కుమార్.
సిద్దిపేట బ్యూరో 07, సిద్దిపేట ( జనం సాక్షి )
స్ధానిక సంతోషిమాత దేవాలయము లో మంత్రి వర్యులు శ్రీ హరీష్ రావు ఆదేశాల మేరకు పురపాలక సంఘం చైర్ పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్స్ సూచన మేరకు ప్లాస్టిక్ రహిత ఉగ్నములో భాగముగా ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించుకొనే భక్తుల కోసం బట్ట సంచుల అందించాలనే ఉద్దేశంతో ఆలయ పాలక మండలి వారు ఆలయం పేరుతో బట్ట సంచులను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమం ఆలయ 30 వ వార్షికోత్సవం సందర్భంగా ఆవిష్కరించాము అని అదే విధముగా ఈ వార్షికోత్సవం సందర్భముగా అందరూ ఆరోగ్యముగా ఆనందముగా ఉండాలని శ్రీ చండీ హవనం నిర్వహించారని తడుపరి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారని అదేవిధముగా సాయంత్రము సామూహిక కుంకుమ పూజల నిర్వహించారని సోమవారము రోజున పూర్ణాహుతి, అన్న ప్రసాద వితరణ సాయంత్రం రథోత్సవం ఉంటుంది అని ఆలయ చైర్మన్ మాంకాల నవీన్ కుమార్ మరియు పాలక మండలి సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మాంకాల నవీన్ కుమార్-నాగరాణి దంపతులతో పాటు పూర్వ ఛైర్మెన్ కాచమ్ కాశీనాథ్-పద్మ దంపతులు ధర్మకర్తలు గాదగోని సత్యం గౌడ్-కలావతి గ్యాదరి కృష్ణ-రాధిక గందే మాధురి, కొమురవెల్లి కళ్యాణి, పోకల సంతోష్ కుమార్ ఎక్స్ అఫిషియో సభ్యులు శాకం మధుసూధన్ రావు వైదిక నిర్వాహకులు శ్రీ ఉమాపతి రామేశ్వర శర్మ గారు వారి పరివారం మరియు ఆలయ ప్రధాన అర్చకులు పి రామకృష్ణ సిబ్బంది శంకర్, వాసు తదితరులు పాల్గొన్నారు.