శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ స్కూల్ లో ఘనంగా బోనాల పండుగ

 

ఇటిక్యాల (జనంసాక్షి) జూలై 17 : శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ స్కూల్లో సోమవారం బోనాల పండుగను ఉత్సాహంగా నిర్వహించి తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయ భావాన్ని చాటారు. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులు సాంప్రదాయ దుస్తులను ధరించి బోనం కుండను మోస్తూ తెలంగాణ జానపద నృత్యాలను ప్రదర్శిస్తూ వివిధ రూపాలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి తమ ప్రతిభను చాటుకున్నారు. పాఠశాల ఆవరణంలో బోనాల వేడుకలను నిర్వహించడం పై పాఠశాల కరస్పాండెంట్ గోవర్ధన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఆచార సంప్రదాయాలు, తెలంగాణ విలువల పై అవగాహనతో ఉండాలన్నారు. అనంతరం బోనాల పండుగను పురస్కరించుకొని విద్యార్థులు, ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సంధ్య, ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు, నందిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.