శ్లోకసంద్రంలో ఉన్న కుటుంబాన్ని పరామర్శించిన బి ఎస్ పి పార్టీ

మానవపాడు, జులై 29(జనంసాక్షి):
పదో తరగతి ఫెయిలవడంతో తోటి విద్యార్థుల హేళన తట్టుకోలేక ఉరేసుకున్న సంఘటన
జోగులాంబ గద్వాల్ జిల్లా మనవపాడు మండలం చెన్ని పాడు గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
నరేష్ అనే విద్యార్థి ఈ సంవత్సరం ssc పలితలో తెలుగు సబ్జెక్ట్ తప్పడంతో మానసిక స్థితికి లోనయ్యాడు తండ్రి నగేష్ తల్లి జ్యోతి లు వీరు కూడా కుమారుడికి అండగా వుండి మళ్లీ అవకాశం వుంటుంది నీవు బాధపడకు అంటూ ఎంతో దైర్యని ఇచ్చారు అయినప్పటికీ తన తోటి స్నేహితులు హేళనగా మాట్లాడటం వల్ల తను అవమానానికి గురై ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు వురి వేసుకొని ఆత్మ హత్యకు గురయ్యాడు అని స్థానికులు అంటున్నారు.
నగేష్ జ్యోతి దంపతులకు
ఇద్దరు కుమారులు నరేష్ పెద్ద అబ్బాయి గ్రామంలోనే పదవ తరగతి. చిన్న అబ్బాయి తోమిదోవ తరగతి.
చేతికి వొచ్చిన కుమారుడు ఎన్నో ఆశలతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు ఇక లేడని రాడనీ ఈ విషయాన్ని జీర్ణించుకోలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తు ఆ కుటుంబం దుక్క సంద్రంలో మునిగిపోయింది.
అలాగే తండ్రి నగేష్ మాట్లాడుతూ నా కుటుంబంలో జరిగిన విషాదం ఏ కుటుంబంలో జరగకూడదు పిల్లలకు ముందుగానే స్కూలలో మానసిక స్థైర్యాన్ని ఉపాధ్యాయులు ఇవ్వాలి తోటి స్నేహితులు కూడా అండగా నిలబడలి అంటూ సందేశాన్ని ఇచ్చారు.
.. బి ఎస్ పి నాయకులు రేపల్లె రాజు
ప్రభుదాసు మాట్లాడుతూ అలాగే ఈ పేద కుటుంబనికీ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ప్రభుత్వ పథకాలు ఇచ్చి ఆదుకోవాలి అలాగే రెండోవ కుమారున్ని ఉన్నత విద్యను అలాగే శ్రీరామ్ కు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే భవిష్యత్తులో ఈ కుమారుడు ఇ కుటుంబానికి అండగా ఉంటాడని బి.ఎస్.పి డిమాండ్ చేస్తుంది ఈ కుటుంబానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలని కోరారు

కార్యక్రమంలో
బిఎస్పి నాయకులు
అయ్యన్న రామకృష్ణ గ్రామస్తులు తదితరులు ఉన్నారు.