షరపోవా.. ఐయామ్‌ సారీ

         
లండన్‌,జూన్‌ 24 (జనంసాక్షి) :  టెన్నిస్‌ స్టార్స్‌ సెరెనా విలియమ్స్‌ , మరియా షరపోవా మధ్య వివాదానికి తెరపడింది. తాను చేసిన వ్యాఖ్యలకు సెరెనా క్షమాపణలు చెప్పింది. తాను సహనం కోల్పోయి మాట్లాడానని , క్షమించాలని కోరింది. షరపోవా ప్రియుడు గ్రిగోర్‌ దిమిత్రోవ్‌ గురించి ఈ అమెరికా నల్లకలువ కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఒక చెడ్డ వ్యక్తితో షరపోవా తిరుగుతోందంటూ వ్యాఖ్యానించింది. దీనిపై రష్యన్‌ బ్యూటీ మండిపడింది. తన లవర్‌ను కామెంట్‌ చేయడం సరికాదని , సెరెనా తన సొంత విషయాలు చూసుకుంటే మంచిదని హెచ్చరించింది. అయితే వింబుల్డన్‌ టోర్నీ ప్రారంభమైన నేపథ్యంలో అందరి దృష్టీ వీరిద్దరి గొడవపైనే పడింది. పరిస్థితులు హద్దు దాటితే ప్రమాదమని భావించిందో ఏమో గానీ సెరెనా సారీ చెప్పేసి గొడవను ముగించేసింది. ఇక తాను ఆటపైనే దృష్టి పెడతానని చెప్పింది.