షూటింగ్ బాల్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ.

తొర్రూరు28 సెప్టెంబర్( జనంసాక్షి )
డివిజన్ డివిజన్ కేంద్రంలోని జడ్పీఎస్ఎస్ పాఠశాలలో రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ క్రీడలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు,గిరిజన విభాగం కన్వీనర్, ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల గౌరవ అధ్యక్షులు మాలోత్ బిక్షపతి నాయక్ సహకారంతో రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షూటింగ్ బాల్ జిల్లా బాలుర,బాలికల జట్ల క్రీడాకారులకు రూ. 30 వేల విలువగల క్రీడా దుస్తులను బుధవారం అందజేశారు. క్రీడా దుస్తులను జడ్పీ ఫ్లోర్ లీడర్,రాష్ట షూటింగ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మంగలపల్లి శ్రీనివాస్, ఎస్సైలు గండ్రాతి సతీష్,పిల్లల రాజు లతో కలిసి బిక్షపతి క్రీడాకారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షూటింగ్ బాల్ క్రీడాకారులను ప్రతి ఒక్కరూ పప్రోత్సహించాలన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడలను ప్రోత్సహించాలని కోరారు. క్రీడాకారులు జాతీయస్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన్ కార్యదర్శి చెడుపల్లి ఐలయ్య,టిఆర్ఎస్ నాయకులు రాయిశెట్టి వెంకన్న,షూటింగ్ బాల్ అసోసియేషన్ 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు,విద్యార్థులు పాల్గొన్నారు.


Sent from Email.Avn for mobile