సంక్షేమ హాస్టళ్లలో పర్మినెంట్ వార్డెన్లను నియమించాలి
నర్సంపేట, జూన్ 17(జనంసాక్షి) :
సంక్షేమ వసతి గృహాల్లో పర్మినెంట్ వార్డెన్లను నియమించాలని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య (టీఎన్‌ఎస్‌ఎఫ్) డివిజన్ అధ్యక్షుడు అజ్మీరా వీరన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నర్సంపేట పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. సంక్షేమ హాస్టళ్లలో పర్మినెంట్ వార్డెన్లను నియమించక పోవడంతో విద్యార్థులు నానాఇబ్బందులు పడాల్సి వస్తుంద న్నారు. విద్యార్థుల విద్యాభివృద్ది కోసం ఇంచార్జీ వార్డెన్లు కృషి చేయలేక పోతున్నారని పేర్కొ న్నారు. ఇప్పటికైనా సంక్షేమ హాస్టళ్లలో పర్మినెంట్ వార్డెన్లను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈసమావేశంలో ఆసంఘం నాయకులు శ్రీనివాస్, నరేష్, మురళి, శ్రావన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.