సంక్షేమ హాస్టళ్ళలో ఖాళీల భర్తీకి కృషి..

..దోమ సర్పంచ్ కె. రాజిరెడ్డి*
*దోమ.న్యూస్ జనం సాక్షి.

దోమ మండలకేంద్రంలోని బీసీ ఎస్సి సంక్షేమ హాస్టళ్ళలో ఖాళిల బర్టీకి చెర్యల కోసం దోమ మండల సర్పంచుల సంఘము అధ్యక్షులు కె రాజిరెడ్డి శుక్రవారం హాస్టల్ వార్డెన్ ప్రధానోపాధ్యాయులు పురాంధసులుతో మాట్లాడారు ఎస్సి హాస్టల్ లో 90 కి పైగా హాస్టల్ విద్యార్థులు ఉండగా బీసీ హాస్టల్ లో 20 మంది విద్యార్థులు ఉండడం తో ఎస్సి హాస్టల్ లో పెండింగ్ లో ఉన్న 8 దరఖాస్తులను బీసీ హాస్టల్ కు పంపాలని సర్పంచ్ రాజిరెడ్డి ఎస్సి హాస్టల్ వార్డెను కోరారు దోమ జిల్లా పరిషత్ పాఠశాలలో 6 నుండి పదవ తరగతి చదవడానికి వచ్చిన పక్క గ్రామాల విద్యార్థులను బీసీ హాస్టల్లో చేరేలా చూడాలని హెచ్ఏం ను కోరారు.జిల్లా పరిషత్ పాఠశాలలో 6. నుండి పది తరగతుల విద్యార్థుల వివరాలు సేకరించి చుట్టూ పక్కల గ్రామాల్లో కి వెళ్లి విద్యార్థుల పేరెంట్స్ కు కూడా హాస్టల్లో విద్యార్థులకు అందిస్తున్న మెనూ ప్రత్యేక తరగతుల గురుంచి వివరించి అడ్మిషన్ పొందాలని ఆయా గ్రామాల సర్పంచ్ ఎంపీటీసీ లు ఇతర ప్రజాప్రతినిధులు పెద్దలు యువకులను కలవాలని సర్పంచ్ రాజిరెడ్డి వార్డెన్ శ్రీనివాస్ కు సూచించారు.*