సంగారెడ్డి కోర్టులో హాజరైన శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌

సంగారెడ్డి, (జనంసాక్షి): ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ను పోలీసులు సంగారెడ్డి కోర్టులో హాజరుపరిచారు. 2005లో అప్పటి కలెక్టర్‌ సంఘాల్‌ను దూషించారని ఆరోపిస్తూ నమోదైన కేసు విచారణలో భాగంగా ఆయన్ను గురువారం కోర్టులో హాజరుపరిచారు. ఈ రోజు ఉదయం ఆదిలాబాద్‌ కారాగారం నుంచి అక్బరుద్దీన్‌ను సంగారెడ్డి కోర్టుకు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం పార్టీ కార్యకర్తలు, మద్దతు దారులు పెద్ద ఎత్తున కోర్టు వద్దకు చేరుకుని నినాదాలు చేశారు దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కార్యకర్తలను లాఠీఛార్జీ చేసి చెదరగొట్టారు.