సంఘo సభ్యుల సూచనలు తప్పక పాటిస్తాం..

సంఘం అభివృద్ధి లక్ష్యం…
చైర్మన్ సంజీవ రెడ్డి ..
శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 29
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధి కోసం సంఘ సభ్యుల, పాలకవర్గం సూచనలు తప్పక పాటిస్తామని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పొద్దుటూరి సంజీవరెడ్డి అన్నారు. గురువారం మెట్ పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ మహాసభ సంగం పరిధిలోని లింగాపూర్ గ్రామంలోని గోదాములో సంఘం చైర్మన్ పొద్దుటూరి సంజీవరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ మహాసభలో 20 22/2023 సంవత్సరానికి ఆదాయం వ్యయములను సంఘం సీఈవో శనిగరపు సదయ్య మహాసభలో సభ్యుల కు చదివి వినిపించారు. ఈ సందర్భంగా మహాసభకు హాజరైన సంఘ సభ్యులు, సంఘం పరిధిలో ప్రభుత్వము ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైస్ మిల్లర్లు వరి ధాన్యాన్ని దిగుమతి చేసుకోకుండా రైతులను ఒక క్వింటాలు వడ్లకు సుమారుగా 12 నుంచి 15 కిలోల వరకు తాలుతేమా పేరుతో దోచుకుంటే సంఘం తగిన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేయడంతో, చైర్మన్ సంజీవరెడ్డి మాట్లాడుతూ సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను 11 గ్రామాల్లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ధాన్యము కొనుగోలు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే జరుగుతుందని, వారి ధాన్యాన్ని నాణ్యత పరిమాణాన్ని వ్యవసాయ శాఖ అధికారులు చూసుకోవడం జరుగుతుందని, మిల్లర్ల వద్ద దిగుమతిని సివిల్ సప్లై అధికారులు పర్యవేక్షణ చేస్తారని వెల్లడించారు. రానున్న కాలంలో రైతుల సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు. సంగం అభివృద్ధి కోసం సంఘ సభ్యులు పాలకవర్గ సభ్యులు తనకు అండగా ఉండాలని కోరారు. ఈ సమావేశంలో లింగాపూర్ గ్రామ సర్పంచ్ అంతం వీరారెడ్డి, సంఘం ఉపాధ్యక్షుడు అంతం రవీందర్ రెడ్డి, పాలకొరకు సభ్యులు బోనగిరి ఐలయ్య, బోడ సుధాకర్, కాటం బుచ్చిరెడ్డి, గాజుల లీలమ్మ, కవ్వ పద్మ, కాల్వ వెంకటరమణారెడ్డి, అంగడి సారయ్య, సీఈవో శనగరం సదయ్య, గోదాం ఇన్చార్జిలు రాజు వాసుదేవ రెడ్డి అటెండర్ నిజాముద్దీన్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.