సంస్థాగతంగా టీఆర్ఎస్ను బలోపేతం చేయాలి
` తెరాస జిల్లా కమిటీలు, ప్లీనరీపై త్వరలో నిర్ణయం
` జిల్లా అధ్యక్షులను త్వరలో సీఎం కేసీఆర్ ప్రకటిస్తారు.
` పార్టీ ప్రధానకార్యదర్శులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్
హైదరాబాద్,సెప్టెంబరు 22(జనంసాక్షి): తెరాస జిల్లా కమిటీలు, ప్లీనరీపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు వెల్లడిరచారు. సంస్థాగత కమిటీల నిర్మాణంపై పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ ఇవాళ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా అధ్యక్షులను త్వరలో సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని తెలిపారు. గ్రామ, మండల కమిటీలు పూర్తయ్యాయని ఎమ్మెల్యేలు కేటీఆర్కు తెలిపారు. ఇంకా ఎక్కడైనా మిగిలి ఉంటే రేపటికల్లా పూర్తి చేయాలని సూచించారు. ఈనెల 24 నుంచి ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు కాబట్టీ, ఎల్లుండి లోగా కమిటీల వివరాలన్నీ రాష్ట్ర కార్యాలయానికి పంపించాలని కేటీఆర్ పేర్కొన్నారు. కమిటీల నిర్మాణం, పార్టీ సంస్థాగత కార్యక్రమాలను, గత 20 రోజులుగా పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న స్పందనను అడిగి తెలుసుకున్న మంత్రి కేటీఆర్ ఇప్పటికే పార్టీ ఆదేశాల మేరకు 12 వ తేదీ నాటికి గ్రామ కమిటీలు, గ్రామంలోని అనుబంధ కమిటీలు పూర్తి అయ్యాయి 20వ తేదీ నాటికి మండల కమిటీలు, మండల అనుబంధ కమిటీలు పూర్తి అయ్యాయి. కమిటీల నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో వాటికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని సూచించారు. ఒకటి రెండు రోజుల్లో కమిటీల సమగ్ర సమాచారాన్ని అందిస్తామని ఎమ్మెల్యేలు కేటీఆర్కు తెలిపారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలంతా 24న అసెంబ్లీ సమావేశాలకి హైదరాబాద్ వస్తారు కాబట్టి ఆ లోపల కమిటీల నిర్మాణ తుది జాబితాలను పంపాలని కేటీఆర్ సూచించారు. గ్రామ మండల పట్టణ కమిటీల నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో జిల్లా కమిటీలు, ఆ తర్వాత జరిగే పార్టీ ప్లీనరీ పైన త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది