సచివాలయంలో మంత్రులతో సమావేశమైన దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌

హైదరాబాద్‌ జ‌నంసాక్షి:  దిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కేజ్రివాల్‌ తొలిసారిగా సచివాలయానికి చేరుకుని మంత్రివర్గ సహచరులతో పాటు సీనియర్‌ అధికారులతో సమావేశమయ్యారు. భవిష్యత్‌ కార్యచరణపై మంత్రివర్గ సహచరులతో చర్చించారు. ఆయన వెంట మంత్రులు మనీష్‌ సిసోడియా, సందీప్‌కుమార్‌, సత్యేందర్‌ జైన్‌, గోపాల్‌రాయ్‌, జితేందర్‌ సింగ్‌ తోమర్‌, అశీం అహ్మద్‌ ఖాన్‌ ఉన్నారు.