సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు దేశానికే ఆదర్శం

జనంసాక్షి / చిగురుమామిడి – సెప్టెంబర్ 16:
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో గల అంబేద్కర్ విగ్రహంనికి పూలమాలలు వేసి ముఖ్యమంత్రి కేసీఆర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ చిత్రపటాలకు టిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు బెజ్జంకి అంజయ్య ఆధ్వర్యంలో శుక్రవారం పాలాభిషేకం చేశారు.నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర పరిపాలన సముదాయ భవనమైన సెక్రటేరియట్ కు భారత సామాజిక దార్శనికుడు, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రజలకు, భారతదేశానికే ఆదర్శమని చిగురుమామిడి దళిత సంఘాల నాయకులు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహాశయుని పేరుని రాష్ట్ర సెక్రటేరియట్ కు పెట్టడం ద్వారా మరొకసారి దేశానికి ఆదర్శంగా కేసీఆర్ నిలిచారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి, వైస్ చైర్మన్ కరీవేద మహేందర్ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు సాంబారి కొమురయ్య, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు మామిడి అంజయ్య, జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి, సర్పంచ్ బెజ్జంకి లక్ష్మణ్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు సర్వర్ పాషా, గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్, కొమ్ము కొమురయ్య, వంతడుపుల దిలీప్ కుమార్, బెజ్జంకి రాంబాబు, బోయిని సదయ్య, జిల్లల నాంపల్లి, గడ్డం అనిల్, రాకం అనిల్, ముక్కెర సదానందం, నాగేల్లి రాజిరెడ్డి , మాసం సది కుమార్, జిల్లల సదయ్య, జిల్లల రాజు తదితరులు పాల్గొన్నారు.