సడక్ బంద్ విఫలం చేసిన జిల్లా పోలీసులు సడక్ బంద్ విఫలం చేసిన జిల్లా పోలీసులు ఎమ్మార్పీఎస్నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 

సడక్ బంద్ విఫలం చేసిన జిల్లా పోలీసులు సడక్ బంద్ విఫలం చేసిన జిల్లా పోలీసులు ఎమ్మార్పీఎస్
జోగు లాంబ గద్వాల బ్యూరో జనంసాక్షి జూలై 02 : కేంద్ర ప్రభుత్వం ఎస్సి వర్గీకరణ బిల్లు పెట్టాలంటూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తoగా 2వ తారీఖు 3వ తారీఖు చలో హైదరాబాద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో  ఈరోజు సడక్ బంద్కు జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ జిల్లా అదనపు ఎస్పీ బి. రాములు నాయక్ తో కలిసి ఎర్రవల్లి చౌరస్తా, అలంపూర్ చౌరస్థ దగ్గర పుల్లూరు చెక్ పోస్ట్ లను పరిశీలించి పోలీస్ బందోబస్తూ ను పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా  ఎమ్మార్పీఎస్  వారు సడక్ బంద్ కు పిలుపునిచ్చిన నేపత్యం లో ఎవరు కూడా బంద్ ల పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడటం జరుగుతుందని అందులో భాగంగానే ముందస్తుగా జిల్లాలో సడక్ బంద్ కు సంబంధించి చాలా మందిని పోలీస్ కస్టడీలోకి తీసుకోవడం జరిగిందని, జిల్లా లో ఎలాంటి బంద్ లకు పోలీసుల అనుమతి లేదని తెలియజేశారు.ఎస్పీ వెంట సాయుధ దళ డి. ఎస్పీ శ్రీ ఇమ్మనియోల్ , ఆలంపూర్ సి. ఐ సూర్యనాయక్ , ఆర్. ఐ నాగేష్  అలంపూర్ ఎస్సై శ్రీహరి, ఇటిక్యాల ఎస్సై గోకారి , మల్డకల్ ఎస్సై శేఖర్ ఉన్నారు.