సబ్ స్టేషన్‌లో ప్రమాదం

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్‌లో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ మీటర్లు, అయిల్ ఇంజిన్‌లు ఉన్న గోదాములో షార్ట్ సర్కూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించింది. దీంతో గోదాంలోని విద్యుత్ సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది, సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. ఆస్తి నష్టం విలువను అధికారులు అంచనా వేస్తున్నారు.