సమగ్ర సర్వేలో ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు

అనుమతించిన ప్రభుత్వం

అమరావతి,నవంబర్‌13(జ‌నంసాక్షి): రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న పరిశ్రమల సమగ్ర సర్వే కోసం.. సచివాలయాల్లోని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లను వినియోగించుకునేందుకు అనుమతి లభించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్ల సహా.. సదుపాయాల కల్పనా సహాయకుల సేవల్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిశ్రమల్లో విద్యుత్‌ వినియోగం, రెవిన్యూ, ఉపాధి కల్పన అంశాలను.. మొబైల్‌ యాప్‌లో నమోదు చేయాలని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు ఆదేశాలు జారీ చేసింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు, పథకాలపై కూడా సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయించింది.